‘భవిష్యత్’కు బాటలు!
త్వరలోనే ఎఫ్‌సీడీఏ మాస్టర్ ప్లాన్‌కు ఆర్‌ఎఫ్‌పీ ఫిబ్రవరిలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారంభం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో అంతర్జాతీయ నగరాలకు దీటు గా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పర్యావరణానికి అత్య ధిక ప్రాధాన్యత నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఫోర్త్ సిటీలో ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, హరిత జోన్లుగా విభజించిన భారత్ ఫ్యూచర్ సిటీ బృహత్ ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మాస్టర్ ప్లాన్‌పై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుందని, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ)కు ప్రకటన జారీ చేస్తామని ఎఫ్‌సీడీఏ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
రెండు మాస్టర్ ప్లాన్లు
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్‌లో నాలుగో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్‌సీడీఏను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ మేర విస్తరించి ఉన్న ఎఫ్‌సీ డీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. 2 లక్షల ఎకరాల పరిధిలోని ఎఫ్‌సీడీఏకు మరో మాస్టర్ ప్లాన్ ఉంటుంది.
ఫిబ్రవరిలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం
మీర్‌ఖాన్‌పేటలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, సుమారు 16,393 చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఆఫీసును నిర్మిస్తు న్నారు. ఫిబ్రవరిలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి. వంద రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
భారత్ ఫ్యూచర్ సిటీ బృహత్ ప్రణాళిక సిద్ధం
నివాస విభాగం: 1,300
డేటా సెంటర్లు: 500
ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫాక్చరింగ్: 2,000
ఎడ్యుకేషన్ హబ్: 500
లైఫ్ సైన్స్ హబ్: 3,000
హెల్త్ సిటీ: 200
ఏఐ సిటీ: 300
ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్: 100
ఈవీ అండ్ బీఈఎస్‌ఎస్: 200
ప్రత్యేక ప్రణాళికలు
ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.‘1,300 ఎకరాల్లోని వరంగల్‌లోని కాకతీ య మెగా టెక్స్‌టైల్ పార్క్.. 10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. విస్తీర్ణంలో అంతకు వంద రెట్లు పెద్దదైన భారత్ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు, ఉద్యోగావకా శాల్లో నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగావకాశాల కల్పనే ఫ్యూచర్ సిటీ లక్ష్యమని’ ఎఫ్‌సీడీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
‘భవిష్యత్’కు బాటలు!


