చాంపియన్ సరూర్‌నగర్ సర్కిల్
హుడాకాంప్లెక్స్: అత్తాపూర్‌లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌సర్కిల్ టీ–20 క్రికెట్ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్ సర్కిల్ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సరూర్‌నగర్ సర్కిల్ జట్టు మహబూబ్‌నగర్ సర్కిల్ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు అతిథులు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వీఎస్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ య గ్నప్రసాద్, విద్యుత్‌సౌధ సీజీఎం హెచ్‌ఆర్‌డీ బి.రవి, మెట్రోజోన్ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రాన్స్‌కో, డిస్కం స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్‌ల్లో తనిఖీ
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా 108 ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజబాబు తనిఖీ చేశారు. 108 అంబులెన్స్ వాహనంలో ఉన్న మందులు, వాహనంలో ఉన్న సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్ చంద్రశేఖర్‌ను అంబులెన్స్ వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సకాలంలో సేవలు అందించాలి
కేశంపేట: సకాలంలో కాల్స్ స్వీకరించి బాధితులకు సేవలు అందించాలని జిల్లా 108 ప్రో గ్రాం కో ఆర్డినేటర్ రాజబాబు అన్నారు. మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్ సరఫరా, మెడికల్ పరికరాల పనితీరును పరిశీలించారు. పైలెట్ దీపక్‌తో వివరాలు ఆరా తీశారు.
నితిన్‌నబిన్‌ను కలిసిన
శ్రీవర్ధన్‌రెడ్డి
షాద్‌నగర్‌రూరల్: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్‌నబిన్‌ను శుక్రవారం పార్టీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి కేంద్ర మంత్రి బండిసంజయ్‌తో వెళ్లి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అన్నారు. సామాన్య కార్యకర్త జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం భారతీయ జనతాపార్టీలో ఉందన్నారు. నితిన్‌నబిన్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆస్పత్రులకు
షోకాజ్ నోటీసులు
శంకర్‌పల్లి: బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేస్తున్న కారణంగా ము న్సిపల్ పరి ధిలోని 22 ఆస్పత్రులు, క్లినిక్స్‌కు శు క్రవారం మున్సిపల్ కమిషనర్ యోగేశ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బయో మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆస్పత్రులు, క్లినిక్స్ పాటించడం లేదని అన్నారు. వ్యర్థాలను ప్రభుత్వం సూచించిన ఏజెన్సీలకు అప్పగించాలని, దీనిపై ఇప్పటికే పలుమార్లు మౌఖికంగా హెచ్చరించామని, అయినప్పటికీ వారు తీరు మార్చుకోవడం లేదన్నారు. ప్రస్తుతం షోకాజ్ నోటీసులు ఇచ్చామని, పునరావృతమైతే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
చాంపియన్ సరూర్‌నగర్ సర్కిల్
చాంపియన్ సరూర్‌నగర్ సర్కిల్
చాంపియన్ సరూర్‌నగర్ సర్కిల్


