ఆ గ్రామాల్లో హెచ్‌ఆర్‌ఏ అమలు చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్‌ఎంసీలో విలీనమైన గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పెరిపెరి ప్రాంతాన్ని వెంటనే గుర్తించాలన్నారు. మండలంలోని పెరిపెరిలోకి వచ్చే ఎల్మినేడు, పోచారం, ఉప్పరిగూడ, మల్సెట్టిగూడ, కప్పపహాడ్, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, తులేకలాన్, కర్నంగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, నెర్రపల్లి, ఖానాపూర్, తులేకలాన్, దండుమైలారం వరకు హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


