పోరాటయోధుడు పండుగ సాయన్న
చేవెళ్ల: తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న అని ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. పట్టణ కేంద్రంలో బుధవారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటయోధుడు సాయన్న అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


