రూ.వెయ్యి కోట్లు..
భవిష్యత్‌కు బాటలు
లాలాపేట: అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర కూర్పు కోసం రూ.1000 కోట్ల నిధుల మంజూరు జీఓతో ఈ గడ్డపై అడుగు పెట్టినట్లు బుధవారం ఇక్కడి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఓయూ అభివృద్ధికి కేటాయించిన నిధులు డబ్బుగా కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా చూస్తున్నానన్నారు. అధునాతన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలన్నదే తన అభిమతమన్నారు.
చేపట్టబోయే పనులివీ..
కొత్త అకడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక లైబ్రరీ భవనం, రెండు కొత్త మెగా హాస్టళ్లు. స్టూడెంట్ ఎమినిట్స్ సెంటర్, హెల్త్ సెంటర్, జీవ వైవిధ్య ఉద్యాన వనం, కన్వెన్షన్ సెంటర్, యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం.
మారనున్న ఓయూ సమగ్ర రూపం


