ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
● ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
● పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలెల్లో సంబురాలు అలుగుపారుతున్నాయి. ఓ వైపు పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఓట్ల వేటలో ఉండగా.. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలకే జై కొడుతున్నాయి.
మహేశ్వరం: మండల పరిధిలోని 30 పంచాయతీలలో ఉప్పుగడ్డతండా, దిలావార్‌గూడ పంచాయతీల సర్పంచ్‌లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 28 పంచాయతీల్లో 101 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ శైలజ తెలిపారు. 258 వార్డు స్థానాలకు 12 వార్డులు ఎకగ్రీవమవగా ప్రస్తుతం 246 వార్డు స్థానాలకు 665 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు ఇప్పటికే గుర్తులను కేటాయించారు. ఉప్పుగడ్డ తండాలో నేనావత్ రాజునాయక్ ఒక్కరే నామినేషన్ వేయగా దిలావర్‌గూడలో ప్రత్యర్థి సభావత్ అనిత నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో సభావత్ మంజుల ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు.
ముగ్గురు సర్పంచులు, 33 వార్డులు
కందుకూరు: మండల పరిధిలో ముగ్గురు సర్పంచ్‌లతో పాటు 33 వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చాయి. దీంతో ఆ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. సార్లరావులపల్లి నుంచి విస్లావత్ శ్రీను, దావూద్‌గూడతండా నుంచి ముడావత్ హనుమంత్, దాసర్లపల్లితండా నుంచి వాంక్డావత్ బుజ్జి ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికై య్యారు. కాగా దాసర్లపల్లి తండాలో ఆరు వార్డులు ఏకగ్రీవమైయ్యాయి. గత పర్యాయం ఆ తండాలో సర్పంచ్‌తో పాటు వార్డులు అన్ని ఏకగ్రీమైయ్యాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 33 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఆ వార్డులను ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.
పిగ్లీపూర్ సర్పంచ్ ఏకగ్రీవం
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిఽధిలోని పిగ్లీపూర్ సర్పంచ్ పీఠం ఏకగ్రీవమైంది. మూడవ విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉపసంహరణకు చివరి రోజున ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడంతో కోటా ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గ్రామంలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
ఏకగ్రీవంతో ఐక్యత
మాడ్గుల: మండల పరిధిలోని కొర్రతండా, పల్లెతండా, సండ్రల గడ్డ తండా ఏకగ్రీవంతో ఐక్యతను చాటి అందరికి అదర్శంగా నిలిచాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, ఇతర పార్టీలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ గ్రామపంచాతీ అభివృద్ధి కొరకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేశారు.
సభావత్ మంజుల, దిలావార్‌గూడ
బుజ్జి, దాసర్లపల్లితండా
శ్రీను, సార్లరావులపల్లి
హనుమంత్, దావూద్‌గూడతండా
జబ్బర్‌లాల్ నాయక్, కొర్రతండా
సరిత దేవిలాల్, పల్లెతండా
కోటా ప్రభాకర్‌రెడ్డి, పిగ్లిపూర్
జైపాల్‌నాయక్, సండ్రల గడ్డ తండా
ఏకగ్రీవమైన వార్డులు
గ్రామం వార్డుల సంఖ్య
దావుద్‌గూడ తండా 5
పెద్దమ్మతండా 7
దాసర్లపల్లితండా 6
మురళీనగర్ 4
జైత్వారం 3
బేగంపేట 2
కొలన్‌గూడ 2
ధన్నారం 1
సార్లరావుపల్లి 1
బాచుపల్లి 1
మీర్‌ఖాన్‌పేట 1
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు


