అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
షాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో కూతురు గోపాల్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రజ లకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజే యాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త శ్రమిస్తే విజయాన్ని అందుకుంటామన్నా రు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దూరు మాణయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, నా యకులు కూతురు మహేందర్, సంజీవ, రవీందర్‌రెడ్డి, క్యామ నారాయణ, వైభవ్‌రెడ్డి ఉన్నారు.


