పరిహారం పెంచండి
మహేశ్వరం: ఐటీ పార్కు కోసం భూములు కోల్పోతున్న తమకు అందించే పరిహారం పెంచాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నాగిరెడ్డిపల్లిలో టీజీఐఐసీ ఐటీ పార్కు కోసం సుమారు 196 ఎకరాల పట్టా, సీలింగ్ భూమిని తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు ఎకరానికి రూ.కోటి పది లక్షలు, 121 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారని అన్నారు. ఎకరానికి రూ.2 కోట్లు, రామారావు చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. మొత్తం పరిహారం ఒకేసారి ఇవ్వాలని విన్నవించారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు నాగిరెడ్డిపల్లి రైతుల వినతి


