భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
మంచాల: జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. మండల పరిధిలోని ఆరుట్లలో కొనసాగుతున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు శనివారం ఆయన హాజరయ్యారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఉమారాణి, సూపరింటెండెంట్ అజీమ్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్–2025కు సంబంధించి విద్యుత్ సరఫరా పనులను టీజీఎస్‌పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ చిలుకమర్రి చక్రపాణి శనివారం పర్యవేక్షించారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలో ఉన్న 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మీర్‌ఖాన్‌పేటలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో పాటు సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా సవ్యంగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట విద్యుత్ ఎస్‌ఈ శ్రీరామ్‌మోహన్, డీఈ గోపాలకృష్ణ, ఏడీఈ శంకర్, ఏఈ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.
తుక్కుగూడ: వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రజల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితా దేవి అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పథకం కింద ఇంట ర్వ్యూల ద్వారా ఎంపిక చేసిన పదిమందికి మెడికల్ అధికారుల పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సేవాభావంతో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొందుర్గు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీఓ సురేష్ మోహన్ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే మరోసారి గ్రామాన్ని తనిఖీ చేస్తానని, ఆ సమయంలో పారిశుద్ధ్య లోపాలుంటే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంఏఓ హన్మంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి


