‘బిర్సా’ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కడ్తాల్: ఆదీవాసి గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు బిర్సా ముండా అని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధి కారి (డీటీడీఓ) కేఈ రామేశ్వరిదేవి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో శనివారం బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామేశ్వరిదేవి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారు లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన హక్కుల కోసం బ్రిటీష్ పాలకులపై పిడికిలి బిగించి పోరాటం సాగించిన ధీరుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలను స్మరించుకుంటూ నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజన సమాజ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓ బాలరాజు, హెచ్‌ఎం పాపయ్య, వివిధ పాఠశాలల హెచ్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.
డీటీడీఓ రామేశ్వరిదేవి


