ఆ లోటుతోనే జూబ్లీహిల్స్‌లో ఓటమి
షాద్‌నగర్‌రూరల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేకపోవడంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శనివారం తెలంగాణ జాగృతి షాద్‌నగర్ ఇన్‌చార్జి సీమల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే ఆ ఇంటికి అంత మంచిది కాదని, కవిత కన్నీళ్లు పెట్టుకున్నందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే ఆమె జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 20న షాద్‌నగర్ నియోజకవర్గంలో జనంబాట చేపట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం జాగృతి జనంబాట ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి ముస్లిం, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తఫా, నాయకులు ఉదయ్‌బాలాజీ, అభిషేక్‌రెడ్డి, బాబురావు, నిఖిల్, సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్


