ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
షాద్‌నగర్‌రూరల్: గ్రామగ్రామాన సీపీఐ వందేళ్ల ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శనివారం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ.. పార్టీ ఏర్పడిన తరువాత దేశంలో భూస్వాములు, దోపిడీదారులు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు బుద్దుల జంగయ్య, మండల కార్యదర్శి గోవింద్‌నాయక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్, ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి చంద్రబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు


