ఉత్సాహంగా హార్స్ రైడింగ్ పోటీలు
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న హైదరాబాద్ పోలో అండ్ హార్స్ రైడింగ్ (హెచ్‌పీఆర్సీ) క్లబ్‌లో ఎంఎస్‌ఎన్ రియాలిటీ అరెనా పోలో చాంపియన్ షిప్–2025 పోటీలు ఉత్సాహంగా జరుగుతు న్నాయి. రెండో రోజు శనివారం హైదరాబాద్ (హెచ్‌పీఆర్‌సీ), ముంబై వారియర్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో హైదరాబాద్ జట్టు 18–07 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆదివారం హైదరాబాద్, తెలంగాణ జట్ల మధ్య ఫైనల్ పోటీ జరుగనుంది.
అబ్దుల్లాపూర్‌మెట్: రాచకొండ సీపీ సుధీర్ బాబు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్టేషన్‌లో పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం సినీ నటుడు మహేశ్ బాబు టీజర్ లాంచ్ నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా, ఈవెంట్‌కు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, యాదాద్రి భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఎస్‌ఓటీ డీసీపీ రమణారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, సైబర్‌క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, వుమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి పాల్గొన్నారు.


