కృత్రిమ ఇసుక ఫిల్టర్లు ధ్వంసం
ఆమనగల్లు: మండల పరిధిలోని శెట్టిపల్లి సమీపంలో కృత్రిమంగా తయారు చేస్తున్న ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలను శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. అక్రమంగా ఇసుక తయారీ చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. జేసీబీల సాయంతో ఇసుక ఫిల్టర్లను కూల్చివేశారు. ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న శెట్టిపల్లికి చెందిన పర్వతాలు, శ్రీశైలంపై కేసు నమోదు చేశామన్నారు. ఫిల్టర్ ఇసుక తయారు చేసినా, అక్రమంగా రవాణా చేసిన చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇసుక తయారీ చేసేవారిపై క్రిమినల్ కేసులు
కడ్తాల్: కృత్రిమ ఇసుకను తయారీదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ గంగాధర్ హెచ్చరించారు. అన్మాస్‌పల్లి పంచాయతీ పరిధి పుల్లేరుబోడ్ తండాకు చెందిన జాన్య నాయక్ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శనివారం తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని.. వేరే రైతుల పొలాల నుంచి తీసుకువచ్చిన మట్టిని, నీటితో కడిగి ఇసుకగా మార్చేందుకు సిద్ధంగా ఉంచారని గుర్తించామన్నారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి జాన్య నాయక్‌పై కేసు నమోదు చేసి అనంతరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు.
కృత్రిమ ఇసుక ఫిల్టర్లు ధ్వంసం


