‘పీఎంఆర్’.. త్వరలో డీమ్డ్ వర్సిటీ
చేవెళ్ల: పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల, ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మండలి చీఫ్‌విప్, పీఎంఆర్ మెడికల్ కలాశాల చైర్మన్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఓరియేంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు దాదాపు 18 వందల మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కళాశాల నుంచి ఎంతో మంది వైద్యులను తయారు చేస్తున్నామన్నారు. ఈ కళాశాలను త్వరలో డీమ్డ్ వర్సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. మెడికల్ కళాశాలలో గోల్డ్‌మెడల్ సాధించిన శివానిగౌడ్‌కు రూ.లక్ష చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్, ఏవీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ వరదారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జోయారిణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ గౌరీ, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్‌రావు, జీఎం నగేశ్, ఎంజీఎం రవివర్మ, సీఓఓ అజీమ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మానిక్యరెడ్డి, ఏఓ వినోద్, కిరణ్, అనిల్, విక్రమ్, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మండలి చీఫ్ విప్, పీఎంఆర్ మెడికల్ కళాశాల చైర్మన్ పట్నం మహేందర్‌రెడ్డి


