వైఎస్ జగన్ మళ్లీసీఎం కావాలని..
మొయినాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆయన అభిమాని చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేశారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్‌కుమార్ గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలని మొక్కుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మళ్లీ సీఎం కావాలని వంద దేవుళ్లకు పూజలు చేస్తున్నానని.. ఇందులో భాగంగా చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించినట్టు స్పష్టం చేశారు. బాలాజీ ఆశీస్సులు జగనన్నపై ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.


