ప్రభుత్వం సానుకూలం
శంకర్‌పల్లి: జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వీటికి పరిష్కారం దొరుకుతుందని, ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఓ రిసార్ట్‌లో గురువారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌తో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. విజయవాడలో నిర్వహించే ఐజేయా ప్లీనరీని జయప్రదం చేయాలన్నారు. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సైతం అదేబాటలో..
రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున అందోళన చేపడుతామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా విస్మరించిందని, అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ సైతం అదే బాటలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆరోగ్య పథకం, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సలీంపాషా, నాయకులు ఎంఏ మాజిద్, వై.నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి


