రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
సబ్సిడీపై అందజేయనున్న ప్రభుత్వం
కడ్తాల్: వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఎక్కువవుతోంది. పెట్టుబడులు పెరిగాయి. దీంతో సాగు కర్షకులకు కష్టంగా మారింది. యంత్రాలతో కూలీల సమస్యను అధిగమించడంతో పాటు.. సమయం, ఖర్చు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. పెద్ద ఆసాముల సంగతి ఎలా ఉన్నా.. వాటిని కొనుగోలు చేసే శక్తి సన్న, చిన్న కారు రైతులకు లేదు.
పెరిగిన పెట్టుబడి
సాగు రైతన్నకు భారంగా మారింది. పెట్టుబడి అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్, సమ్మాన్ యోజన లాంటి పథకాలు పెట్టుబడికి సాయపడుతున్నప్పటికీ.. అంతగా మేలు చేకూరడం లేదు. ఆధునిక పరికరాలతో సాగు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ సంఖ్యలో చిన్న, సన్న కారు రైతులే ఉండటంతో.. ట్రాక్టర్ కాకపోయినా..నాగలి, గుంటుక, గొర్రు, చేతి పంపులు,పవర్ స్ప్రేయర్ లాంటివి కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు.
50 శాతం సబ్సిడీతో..
2017 వరకు నాటి ప్రభుత్వాలు వ్యయసాయ యాంత్రీకరణలో భాగంగా 40 నుంచి 50 శాతం వరకు రాయితీపై సాగు పనిముట్లు, యంత్రాలను రైతులకు అందజేసింది. ఆ తర్వాత బడ్జెట్ లేదన్న సాకుతో వాటిని నిలిపివేశాయి. ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం పరికరాలు, యంత్రాలను సబ్సిడీపైఅందజేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో మొక్క జొన్న పీకే యంత్రం గడ్డిబేలర్, బ్యాటరీ పుట్, మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్, పవర్ నాప్సాక్ స్ప్రేయర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, రోటావేటర్, సీడ్‌కమ్ ఫర్టీడ్రిల్, డిస్క్ హ్యారో కల్టివేటర్ తదితర యంత్రాలు ఉన్నాయి.
కడ్తాల్ మండలానికి మంజూరైన యూనిట్లు
రైతులకు ప్రయోజనం
మండలంలో 14 వేలకు పైగా రైతులు ఉండగా.. ఇందులో 90 శాతం మేర సన్న, కారు రైతులే ఉన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. వచ్చిన ఈ అవకాశం వారికి కొంత మేర ప్రయోజనం చేకూరనుంది. పరికరాలు కావాల్సిన వారు.. పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ప్రతులను దరఖాస్తు ఫారానికి జతపరిచి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలి. లబ్ధిదారును మండల, జిల్లా స్థాయి కమిటీలు ఎంపిక చేయనున్నాయి.
దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
రైతన్నకు తగ్గనున్న పెట్టుబడి భారం
తీరనున్న కూలీల సమస్య
వినియోగించుకోండి
రాయితీపై ప్రభుత్వం సాగు యంత్రాలను అందజేయనుంది. ఇది పెట్టుబడి తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మండలానికి మంజూరైన యూనిట్ల మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. పారదర్శకంగా లబ్ధిదారులనుఎంపిక చేస్తాం.
– కవిత, ఏఓ, కడ్తాల్
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం


