భారీగా డ్రోన్ల స్మగ్లింగ్
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తీసుకొచ్చిన స్మగ్లింగ్ వస్తువులను భద్రతాధికారులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం అర్థరాత్రి సింగపూర్ నుంచి వచ్చిన తమిళనాడులోని మధురకు చెందిన ముత్తుకోనప్ప తన వద్ద ఉన్న రెండు లగేజీ బ్యాగులను అరైవల్ కేంద్రంలో ఉన్న సాలిక్ అహ్మద్, అష్రఫ్‌షరీఫ్ (బర్మాదేశానికి చెందిన వ్యక్తులు)లకు అప్పగించేందుకు వెళ్తుండగా భద్రతాదికారులు వారి కదలికలను గమనించి వెంటనే లగేజీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 22 విదేశీ డ్రోన్లతో పాటు డీజేకు సంబంధించిన సాంకేతిక పరికరాలు, 22 రిమోట్లు, అన్ని కలిపి సుమారు రూ.27 లక్షల విలువైన వస్తువులు లభ్యమైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.


