భారీగా రేషన్ బియ్యం పట్టివేత
పోలీసుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్
శంకర్‌పల్లి: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని బుధవారం సాయంత్రం మోకిల పోలీసులు పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్నికొందరు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం 33 టన్నులతో నగరం నుంచి వస్తున్న లారీ.. మండల పరిధి మిర్జాగూడ వద్ద తూకం వేసేందుకు ఆగింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు లారీని తనిఖీ చేశారు. రేషన్ బియ్యంగా గుర్తించి, డ్రైవర్ ఆదిత్య యాదవ్(22), క్లీనర్ భిక్షా యాదవ్(20)లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నగరానికి చెందిన ఇబ్రహీం.. ద్వారా బియ్యం వచ్చాయని తెలిపారు. పోలీసులు లారీని సీజ్ చేసి, ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని సీఐ తెలిపారు.
పట్టపగలే కత్తితో దాడి
● పాతకక్షలతో హత్యాయత్నం
● బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే పొడిచిన వైనం
జగద్గిరిగుట్ట: పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని పట్టపగలే కత్తితో పొడిచి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెల్పిన వివరాల ప్రకారం..బుధవారం సాయంత్రం రంగారెడ్డి నగర్‌కు చెందిన రోషన్ సింగ్ తన మిత్రుడు మనోహర్‌తో కలిసి జగద్గిరిగుట్ట్ట బస్టాప్‌లో మాట్లాడుతుండగా, బాలశౌరి రెడ్డి తన స్నేహితులు మహమూద్, ఆదిల్ అక్కడికి చేరుకున్నారు. అకస్మాత్తుగా మహమూద్ రోషన్‌సింగ్‌పై దాడి చేసి కాలర్ పట్టుకోగా..బాలశౌరి రెడ్డి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. 5 చోట్ల కత్తితో గాయపరిచాడు. ఎప్పడు రద్దీగా ఉండే ఈ బస్టాప్‌లో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. పక్కనే ఉన్న రోషన్‌సింగ్ స్నేహితుడు మనోహర్ దాడిని ఆపేందుకు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్ తప్పించుకొని పారిపోగా, అప్పటికే అక్కడ బుల్లెట్ వాహనంతో రెడీగా ఉన్న ఆదిల్‌తో కలిసి ఇద్దరు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రోషన్‌సింగ్‌ను దగ్గరలోని హాస్పటల్‌లో ప్రథమ చికిత్స చేయించి..అనంతరం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. రోషన్ సింగ్ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. రోషన్‌సింగ్, బౌలశౌరిరెడ్డిల మధ్య గతంలో గొడవలు జరిగాయని, వీరిద్దరు పాత నేరస్తులేనని, పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఘటన చోటుచేసుకుందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
భారీగా రేషన్ బియ్యం పట్టివేత


