మొయినాబాద్‌లో ఇద్దరి అదృశ్యం
మొయినాబాద్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షానుబేగం, మహ్మద్ రఫీక్ దంపతులు నాలుగేళ్ల క్రితం తమ ముగ్గురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి జీవనోపాధి కోసం మొయినాబాద్‌కు వలసవచ్చారు. పెద్దమంగళారంలో ఉంటూ కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్దకుమారుడు షకీల్‌బాబా(25) ఈ నెల 2న ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులతో గొడవ పడి..
భూమికి సంబంధించిన డబ్బు ల విషయంలో తల్లి, అన్నతో గొడవ పడిన ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకుండా అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారంకు చెందిన ఉషంగారి హరీష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఈ నెల 2న భూమికి సంబంధించిన డబ్బుల విషయంలో తన తల్లి, అన్నతో గొడవ పడ్డాడు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మొయినాబాద్‌లో ఇద్దరి అదృశ్యం


