ఇందిరమ్మ ఇంటి కోసం.. చిన్నమ్మ జాగకు ఎసరు
● ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో వృద్ధురాలి ఫిర్యాదు
● ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాపట్టించుకోలేదని ఆవేదన
ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని ఎల్మినేడుకు చెందిన మంచిరెడ్డి రాధమ్మ(71) తన ఇంటిజాగను కాపాడాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరింది. ఈ మేరకు మంగళవారం సూపరింటెండెంట్ జంగయ్యకు ఫిర్యాదు అందజేసింది. తనకు 200 గజాల ఇంటి స్థలం ఉందని.. మా మరి ది కుమారుడు చెన్న కిషన్‌రెడ్డి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టి స్థలాన్ని కబ్జాచేసి ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించింది. గతంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా డీపీఓ విచారిస్తామని చెప్పారని.. ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయింది. ఒంటరిగా ఉన్న తనకు న్యాయం చేసేందుకు చెన్నకిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. తనను మానసిక క్షోభకు గురిచేస్తున్న వారినుంచి రక్షించాలని కోరింది.


