కలల తీరం చేరకుండానే.. | - | Sakshi
Sakshi News home page

కలల తీరం చేరకుండానే..

Nov 4 2025 8:09 AM | Updated on Nov 4 2025 8:09 AM

కలల త

కలల తీరం చేరకుండానే..

సుల్తాన్‌బజార్‌: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌ కుమార్తెలు సాయి ప్రియ మహిళా యూనివర్సిటీలో ఎంఎస్‌డీఎస్‌, నందిని ఎంపీసీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. తమ బంధువుల పెళ్లి ఉండడంతో తాండూరు వచ్చి అనంతరం కళాశాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో బలయ్యారు. ఈ ప్రమాదంలో వీరితో పాటు ఇదే యూనివర్సిటీలో బీకాం హానర్స్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్‌ అనే విద్యార్థిని సైతం మృత్యువాత పడింది. మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో తోటి విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సూర్య ధనుంజయ్‌, ప్రిన్సిపల్‌ లోక పావని, అధ్యాపకులు సంతాపం వెలిబుచ్చారు.

కలల తీరం చేరకుండానే.. 1
1/2

కలల తీరం చేరకుండానే..

కలల తీరం చేరకుండానే.. 2
2/2

కలల తీరం చేరకుండానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement