5 నుంచి రామలింగేశ్వర స్వామి జాతర
మంచాల: బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏ ర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకకు రాష్ట్ర నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో రూ.కోటి 5లక్షలతో బీటీరోడ్డు నిర్మాణం, మరో 20 లక్షలతో సీసీరోడ్డు, భక్తులసౌకర్యార్థం బాత్‌రూంల నిర్మాణం చేపట్టారు. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దాత పీఏసీఎస్ చైర్మన్ వెదెరె హన్మంత్ రెడ్డి.. ఆయన తండ్రి రామ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా ప్రసాద విక్రయకేంద్రాన్ని నిర్మించారు. జాతర పనులను హన్మంత్‌రెడ్డితో పాటు.. మాజీ సర్పంచ్‌లు విష్ణు వర్ధన్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. జాతర ప్రారంభం రోజున మరో రూ.25 లక్షలతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి.. ఆలయ గెస్ట్‌హౌస్ నిర్మాణం పనులను ప్రారంభించనున్నారు.
రూ.1.25 కోట్లతో కొనసాగుతున్న ఏర్పాట్లు


