నరేష్‌కు డాక్టరేట్
మంచాల: దళిత యువకుడికి డాక్టరేట్ వరించింది. నిరుపేద యువకుడే అయినా.. పట్టుదల, కృషి ఉంటే పేదరికం ఉన్నత చదువులకు అడ్డు కాదని నిరూపించాడు. మండల పరిధి చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన గ్యార ఎల్లయ్య– ఎల్లమ్మదంపతుల రెండో కుమారుడు నరేష్.. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఎనిమిది నుంచి పది వరకు ఆరుట్ల, ఇంటర్మీడియట్ ఇబ్రహీంపట్నం ప్రతిభ కళాశాలలో పూర్తి చేశాడు. ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించి పట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్‌కళాశాలలో విద్యనభ్యసించాడు. అనంతరం గెట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఓపెన్ కేటగిరీలో ఓయూలో సీటు సంపాదించి, ఎంటెక్ పూర్తి చేశాడు. పీహెచ్‌డీలో సీటు పొందాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఈ.విద్యాసాగర్ పర్యవేక్షణలో.. (మినీమైజేషన్ ఆఫ్ లాసెస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టం బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్) అనే అంశంపై పరిశోధనలు పూర్తి చేసి, డాక్టరేట్ పట్టా పొందాడు. దీంతో గ్రామస్తులు నరేష్‌కు అభినందనలు తెలిపారు.


