దిగుబడి రాక, మద్దతు లేక
పూడూరు: ప్రకృతి కన్నెర్ర చేయడంతో పత్తి రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. పంట పూత, కాత దశలో వాతావరణం అనుకూలించక మొదట్లో పంట దెబ్బతింది. ఆటుపోట్లు ఎదుర్కొని, పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పత్తి తడిసి ముద్దయింది. తడిసి నల్లబడటంతో వ్యాపారులు ఽతక్కువ ధరకు కొనుగోలు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. అటు సరిగా దిగుబడి రాక, వచ్చినా తడిసి నాణ్యత కోల్పోయిన దానికి మద్దతు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరుమండలంలో మొక్కజొన్నతో పాటు అధిక శాతం రైతులు పత్తిని సాగుచేశారు.


