పనికి వెళ్తున్నానని చెప్పి..
మహిళ అదృశ్యం
● కొందుర్గు పీఎస్‌లో కేసు నమోదు
కొందుర్గు: మహిళ అదృశ్యంపై మంగళవారం కేసు నమోదైంది. కొందుర్గు పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మహదేవ్‌పూర్‌కు చెందిన ఎరుకలి మౌనికకు ఆరేళ్ల క్రితం ఫరూఖ్‌నగర్ మండలం చెల్కచిల్కమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదగిరితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. ఇదిలా ఉండగా ఎనిమిది క్రితం యాదగిరి మరణించాడు. అప్పటినుంచి మౌనిక తన తల్లిగారి ఊరైన మహదేవ్‌పూర్‌లో నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం పిల్లలు, తన తల్లి సువర్ణతో కలిసి అమ్మమ్మగారి గ్రామమైన మండల పరిధిలోని బైరంపల్లికి వెళ్లారు. ఈనెల 27న కూలీ పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మౌనిక రాత్రయినా తిరిగిరాలేదు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులను ఆరా తీసినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్‌పై అనుమానం ఉందని మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిగారింటికి బయర్దేరి..
మొయినాబాద్‌రూరల్: వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామానికి చెందిన కొడగండ్ల మంగమ్మ(71) ఈ నెల 24వ తేదీన ఉదయం బస్సులో ఆమె తల్లిగారింటికి బయలుదేరింది. కానీ ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పనికి వెళ్తున్నానని చెప్పి..


