రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
తుక్కుగూడ: రాష్ట్ర స్థా యి ఖోఖో అండర్–19 విభాగంలో తుక్కుగూడ పురపాలిక పరిధిలోని మంఖాల్ గ్రామానికి చెందిన ప్రణయ్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడిని సన్మానించి అభినందించారు. కోచ్‌లు మహేందర్, శ్రీధర్‌రెడ్డిలు మాట్లాడారు. వచ్చే నెలలో నగరంలోని సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: స్థానిక ఎకై ్సజ్ కార్యాలయం పరిధిలోని మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు గెజిట్‌ను విడుదల చేసినట్లు చేవెళ్ల ఎకై ్సజ్ సీఐ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. షాబాద్ మండలంలోని నాగరగూడలోని షాపు నం.110ను గౌడ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. సర్దార్‌నగర్‌లోని షాపు నంబర్ 111కు, చేవెళ్ల మండలంలోని ఖానాపూర్ షాపు నంబర్ 107లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 28వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
అడ్డగుట్ట: పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్‌కు చెందిన అబ్దుల్ ముజీబ్(28) మంగళవారం ఉదయం తన స్నేహితులతో కలిసి సంజీవయ్య పార్క్ – జేమ్స్‌స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు.


