కేజీబీవీని సందర్శించిన రాష్ట్ర బృందం
కొత్తూరు: మండలకేంద్రంలోని కేజీబీవీ హాస్టల్‌ను మంగళవారం రాష్ట్ర శిశుహక్కుల పరిరక్షక్షణ కమిషన్ బృందం సభ్యులు సందర్శించారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు శిశు హక్కులు, బాలికా విద్య–ప్రాధాన్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాలతో అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు వందనగౌడ్, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్‌కుమార్, ఎంఈవో అంగూర్‌నాయక్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
నందిగామను సందర్శించిన జిల్లా అధికారులు
నందిగామ: మండల కేంద్రమైన నందిగామను మంగళవారం జిల్లా స్థాయి అధికారులు సందర్శించారు. సోలార్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ఇటీవల పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా రెడ్కో మేనేజర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పలువురు బృంద సభ్యులు గ్రామంలోని పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. సోలార్ కిట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, పీహెచ్‌సీ, ప్రభుత్వ పాఠశాలలు, పీఏసీఎస్, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక తదితర భవనాలను సందర్శించారు. వీలైనంత త్వరలో సోలార్ పరికరాలను అమర్చేందుకు కృషి చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతి, గ్రామ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి
కడ్తాల్: రైతులు తప్పనిసరిగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని సౌకర్యాలు, కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పశువులకు సోకే గాలికుంటు వ్యాధి తో అప్రమత్తంగా ఉండాలని, పాడి రైతులు ఏ మ్రాతం అలసత్వం వహించినా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడ్‌తండా పంచాయతీలో పశువైద్య ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ పాడి రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భానునాయక్, నాయకులు రమేశ్, రంగనాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
అర్హులైన ప్రతిరైతుకు పరిహారం
కందుకూరు: అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని భూమి అప్పగించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు ఆయన మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఏడుగురు రైతులకు సంబంధించి 27 ఎకరాలకు ఎకరాకు రూ.51,51,906 చొప్పున రూ.14 కోట్ల మేర పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, ఇతర అభివృద్ధి పనుల అవసరాలకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం భూములను సేకరిస్తోందని, 2013 చట్టం కంటే అదనంగా పరిహారం అందిస్తోందని తెలిపారు. అందరూ భూములు ఇచ్చి పరిహారం పొందాలని సూచించారు.
కేజీబీవీని సందర్శించిన రాష్ట్ర బృందం
కేజీబీవీని సందర్శించిన రాష్ట్ర బృందం


