ఔషధ, కూరగాయల తోట పరిశీలన
కందుకూరు: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా మండల పరిధిలోని నేదునూరు మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న పనులను మంగళవారం నాబార్డ్ అధికారులు పరిశీలించారు. సంస్థ జిల్లా డీడీఎం హరీష్, సీజీఆర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్‌ఆర్ అన్నమయ్య, సలహాదారు మహ్మద్ రఫీయొద్దీన్ పాఠ శాల ఆవరణలో చేపట్టిన ఔషధ మొక్కలు, కూరగాయల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్ వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణుప్రియ, ఉపాధ్యాయులు పుష్పలత, గురురాజారెడ్డి, ఎర్త్ లీడర్లు హానిప్రియ, మధిహ, తరుణి, తేజస్విని, రకిత, లతశ్రీ, మాధవి, హాసిని, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజనీకాంత్ పాల్గొన్నారు.
సీజీఆర్ సేవలు ప్రశంసనీయం
కడ్తాల్: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని నాబార్డ్ డిస్ట్రిక్ డెవలప్‌మెంట్ మెనేజర్ హరీశ్ రఘురాం అన్నారు. యంగ్ ఎర్త్ లీడర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సీజీఆర్ పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఔషధమొక్కల తోట, కూరగాయల తోట, కంపోస్ట్‌పిట్, ఇంకుడుగుంతను సీజీఆర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్‌ఆర్ అన్నమయ్య, ఔషధతోటల సలహాదారు మహ్మద్ రఫియొద్దీన్, మండల విద్యాధికారి నిర్మలతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జంగయ్య, సీజీఆర్ కోఆర్డినేటర్ రజనీకాంత్, ఎర్త్‌లీడర్స్, ఉపాధ్యాయులు ఉన్నారు.
తారామతిపేట జెడ్పీ స్కూల్‌లో..
అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలోని తారామతిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల తోట, కూరగాయల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్‌లను మంగళవారం నాబార్డ్ సంస్థ జిల్లా డీడీఎం హరీష్ రఘురాం, సీజీర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్‌ఆర్ అన్నమయ్య, ఔషధ తోట సలహాదారు మహ్మద్ రఫీయొద్దీన్ సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎర్రయ్య, మెంటర్ టీచర్ రమేష్ రావు, ఎర్త్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.


