జిల్లాలో పది కొనుగోలు కేంద్రాలు
దళారులను నమ్మి మోసపోవద్దు డీఆర్‌డీఓ శ్రీలత
ఇబ్రహీంపట్నం: గ్రామీణాభావృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో పది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్‌డీఓ శ్రీలత తెలిపారు. మండలంలోని దండుమైలారంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని, దళారీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ వరి ఽక్వింటాలుకు మద్దతు ధర రూ.2,389, కామన్ గ్రేడ్‌కు రూ.2,369, సన్నరకానికి రూ.500 అదనంగా బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనివెల్లడించారు. పట్టాదారు పాస్‌బుక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నంబర్‌ను సంబంధి త అధికారులకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ బోజప్ప, ఏపీఎంలు సత్యనారాయణ, సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, జంగమ్మ, హరిలాల్ పాల్గొన్నారు.
అక్కడే రైతులు ధాన్యంవిక్రయించాలి


