కారును ఢీకొన్న బస్సు
ఇబ్రహీంపట్నం: చెరువు కట్టపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ సంఘటన సోమవారం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై జరిగింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్ వైపు నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న ఓ బైక్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుక భాగం.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి.. డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. కారుపైకి బస్సు వెళ్లకుండా.. డివైడర్‌పైకి తోలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారులో ఉన్న మాడ్గుల ఎంపీఓ బండారు రవికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. డివైడర్‌పైకి బస్సు ఎక్కడంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
తప్పిన పెను ప్రమాదం


