ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

Oct 28 2025 9:09 AM | Updated on Oct 28 2025 9:09 AM

ప్రజా

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు శృంగేరి పీఠాధిపతిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే పాఠశాల సీజ్‌ ఓల్డ్‌సిటీకి మరో రోడ్డు!

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన డీఆర్‌ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈవారం మొత్తం 56 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

చేవెళ్ల: ఆధ్యాత్మిక మార్గదర్శకులతో సమాజంలో నైతిక విలువలు, సత్యం, ధర్మం, సేవాభావాలు నెలకొంటున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నగరంలోని శంకర్‌మఠంలో సోమవారం శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతి, సనాతన సంప్రదాయాల పరిరక్షణలో శృంగేరి పీఠం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అలాంటి మహనీయుల ఆశీర్వాదంతో ప్రజా సేవాలో మరింత నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్‌ను విద్యాశాఖాధికారులు సోమవారం సాయంత్రం సీజ్‌ చేశారు. ఈ స్కూల్‌లో పదోతరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. స్కూల్‌ పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండటం, ఫైర్‌ సేఫ్టీ అధికారులు ఎన్‌ఓసీ జారీ చేయకపోవడం తదితర కారణాలతో సీజ్‌ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల విద్యాధికారి హీర్యానాయక్‌ పాఠశాలను సీజ్‌ చేశారు. కాగా విద్యార్థుల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది.

సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిటీతో పోటీ పడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఓల్డ్‌సిటీలో మరో రోడ్డుకు మహర్దశ పట్టనుంది. శాస్త్రిపురం నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వరకు (మెహఫిల్‌ హోటల్‌ దగ్గర) రహదారి విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఓల్డ్‌సిటీలోని బహదూర్‌పురా, జూపార్క్‌, ఒవైసీ హాస్పిటల్‌, తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు రావడం తెలిసిందే. నల్లగొండ చౌరస్తా నుంచి ఒవైసీ హాస్పిటల్‌ వరకు మరో ఫ్లై ఓవర్‌పనులు కూడా జరుగుతున్నాయి. వివిధ ఆటంకాలతో కుంటుతున్న సదరు ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి కానప్పటికీ, త్వరలోనే మరికొన్ని అభివృద్ధి పనులు కూడా ఓల్డ్‌సిటీలో జరగనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. శాస్త్రిపురం నుంచి ఇన్నర్‌రింగ్‌రోడ్‌ వరకు వంద అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం రూ. 4.95 కోట్లు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు టెండర్ల దశలో ఉన్నాయని, టెండర్లు పూర్తయ్యాక పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. డిఫెక్ట్‌ లయబిలిటీ కింద పనులు పూర్తయ్యాక ఎలాంటి లోపాలు తలెత్తినా రెండు సంవత్సరాల వరకు పనులు పూర్తిచేసే కాంట్రాక్టు ఏజెన్సీయే బాధ్యతవహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజావాణి అర్జీలను  పెండింగ్‌లో పెట్టొద్దు 1
1/1

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement