మార్పు రావడం లేదు
షాబాద్: ‘ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలకు ముప్పు. వారితో పాటు.. ఎదుటి వారిని ప్రమాదంలో పడేస్తుంది. అది నేరం. బాలబాలికలకు ద్విక్రవాహనాలు ఇవ్వవద్దు. ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత. లైసెన్స్ తప్పనిసరి’ అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. బైకిస్టుల దూకుడు పెరుగుతూనే ఉంది. మైనర్లు, మేజర్లు ముగ్గురు లేదా నలుగురు సైతం ఒకే బండిపై దూసుకుపోతూ.. ప్రమాదంలో పడుతున్నారు. ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలే.
ప్రమాదంలో పడేస్తున్న సరదా
షాబాద్ మండలంలో ద్విచక్ర వాహనదారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక మండలమే కాదు.. ప్రాంతం ఏదైనా ఇదే పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రయ్.. రయ్ మంటూ దూసుకుపోతున్నారు. ఒకే బైక్‌పై మైనర్లు, యువతీ యువకులు ముగ్గురికి మించి ప్రయాణిస్తున్నారు. ఇద్దరే వెళ్లాలన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదంలో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నా.. సరదా అంటూ ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటున్నారు. పిల్లల సరదా తీర్చడానికి బైక్‌లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నటికీ.. వాటిని చాలామంది పట్టించుకోవడం లేదు.కొందరు పెద్దవారికి తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టాల్సినఅవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కఠిన చర్యలు ముఖ్యం
ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని టీఎల్‌ఏఫ్ జిల్లా లీగల్ అడ్వయిజర్ పీసరి సతీష్‌రెడ్డి సూచిస్తున్నారు. ట్రిపుల్, ఫోన్లో మాట్లాడుతూ రైడింగ్ చేయడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇలాంటి వారిపై నిఘాపెంచి, తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. లైసెన్స్ లేని వారిపై చట్టప్రకారం చర్యలు చేపడితే.. త్రిపుల్‌రైడింగ్, మైనర్లు బైక్ నడపడం వంటివి నివారించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం వీడటం లేదు
ట్రిపుల్ రైడింగ్ డేంజర్
దూకుడుగా వ్యవహరిస్తున్న బైకిస్టులు
ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు
అవగాహన కార్యక్రమాలు
పట్టించుకోని వైనం
పట్టుబడితే కేసు
ట్రిపుల్ రైడింగ్‌లో ఎవరూ దొరికినా కేసులు పెట్టి, భారీగా జరిమానా విధిస్తున్నాం. తల్లిదండ్రులు.. తమ పిల్లలతో కలిసి కౌన్సెలింగ్‌కు వస్తే అవగాహన కల్పిస్తాం. ఇలా చేయడం వలన పిల్లల్లో మార్పు వస్తుంది. ట్రిపుల్ రైడింగ్ జోలికి వెళ్లరు. రెండుసార్లు ట్రిబుల్ రైడింగ్‌లో పట్టుబడితే లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం.
– కాంతారెడ్డి, సీఐ షాబాద్
మార్పు రావడం లేదు
మార్పు రావడం లేదు


