రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
షాబాద్: బీసీల రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమిస్తామని మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు నరసింహగౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. న్యాయం జరిగే వరకు పార్టీలకు అతీతంగా బీసీలు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ సాధన సమితి సభ్యులు రాజేందర్‌గౌడ్, రవీందర్, నర్సింహులు, రమేష్ యాదవ్, రాము, కుమ్మరి దర్శన్, సురేష్, నారాయణ, క్మురి శ్రీనివాస్, సురేందర్, తదితరులున్నారు.


