ఉచ్చుబిగించి.. ఊపిరాడకుండా చేసి
● భర్తను చంపిన భార్య
● నిందితురాలికి రిమాండ్
మీర్‌పేట: తరచూ అనుమానిస్తూ.. వేధిస్తున్నాడని భర్త మెడకు ఉచ్చుబిగించి ఊపిరి తీసింది ఓ భార్య. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడ ప్రగతినగర్‌కు చెందిన ఆలంపల్లి విజయ్‌కుమార్ (42), సంధ్యలు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. విజయ్ ఆటో డ్రైవర్‌గా.. సంధ్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. సహోద్యోగితో అక్రమసంబంధం కలిగి ఉన్నావంటూ భర్త.. కొంత కాలంగా ఆమెను వేధింపులకు గరిచేసేవాడు.
అనుమానిస్తున్నాడని..
ఈ క్రమంలో ఈ నెల 20న రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న విజయ్.. ఆలిని కొట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెధిరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. మొదట చున్నీతో అతని మెడకు ఉచ్చుబిగించి, ఆ తరువాత తాడుతో ఊపిరిరాడకుండా చేసిచంపేసింది. అనంతరం నిందితురాలు భర్త మృతదేహాన్ని బాత్‌రూమ్ వద్ద పడేసి, ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేయగా.. గొంతుపై గాయాలనుగుర్తించిన మృతుడి తల్లి సత్తెమ్మ, అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదికలో విజయ్‌ను గొంతు నులిమిచంపినట్లు వెళ్లడయింది. ఈ నెల 26న నిందితురాలు సంధ్య.. అనుమానం, వేధింపులు తట్టుకోలేకే భర్త గొంతు నులిమి హత్య చేశానని మృతుడి సోదరుడు ఆలంపల్లి విజయ్‌భాస్కర్‌కు తెలిపింది. ఈ మేరకు పోలీసులు.. ఆమెను అదుపులోకితీసుకోగా.. తానే హత్య చేసినట్లు ఒపుకుంది.నిందితురాలిని సోమవారం రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


