ప్రమాదాల నివారణకు చర్యలు
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు వాహనాల రాకపోకలు కనిపించకుండా ప్రమాదకరంగా మారాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి నివారణ చర్యల కోసం నడుం బిగించారు. సాగర్‌రోడ్డుపై తక్కళ్లపల్లి గేట్ నుంచి తమ్మలోనిగూడ గేట్ వరకు రోడ్డుకిరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను పోలీస్ సిబ్బందిచే తొలగించేశారు. జేసీబీతో చదును చేయించారు.
వాహనాల తనిఖీలు
సాగర్‌రోడ్డుపై మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుకిరువైపులా చెట్ల కొమ్మల తొలగింపు
ప్రమాదాల నివారణకు చర్యలు


