ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
బండ్లగూడ: ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ద్వారా ఫౌండేషన్ అధ్యక్షులు నీరుడు పవన్‌సాయి ఆధ్వర్యంలో ఆదివారం కిస్మత్‌పూర్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమలో భీమార్జున్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్‌నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు లింగంగౌడ్, సురేష్‌ముదిరాజ్ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిషోర్ వివరాల ప్రకారం..హైదర్‌గూడ ఎర్రబోడ ప్రాంతానికి చెందిన హరిణి(20) రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంతకీ రాలేదు. బంధువులు, స్నేహితులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


