కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

Oct 27 2025 8:52 AM | Updated on Oct 27 2025 8:52 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

బీజేపీ జిల్లా కన్వీనర్‌ ప్రహ్లదరావు

కుల్కచర్ల: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మన్‌కీబాత్‌ కార్యక్రమ వీక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్‌కీబాత్‌ మండల కన్వీనర్‌గా పార్టీ మండల అధ్యక్షుడు కొండ ఆంజనేయులును నియమించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరావు మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు, మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని సందేశాన్ని ఎక్కువ మంది వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ జిల్లా కమిటీ సభ్యుడు జానకిరాం, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement