యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Oct 23 2025 9:16 AM | Updated on Oct 23 2025 9:16 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

ఆమనగల్లు: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామానికి చెందిన వస్పుల మల్లేశ్‌(27) తుక్క్ఠుగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసేవాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. బాధితున్ని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కోతుల దాడిలో గాయపడిన మహిళ మృతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు.. మృతి చెందింది. ఈ సంఘటన పోల్కంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుశీల(68).. 15 రోజుల క్రితం ఇంటి ఎదుట కూర్చున్న ఆమైపె కోతుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుశీల.. నాటి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కోతుల గురించి పంచాయతీ అధికారులు చెప్పినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి, వానరాలను తరలించాలని కోరుతున్నారు.

డివైడర్‌ను ఢీకొని, యువకుడి దుర్మరణం

అత్తాపూర్‌: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ రషీదుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ రయానుద్దీన్‌ (21) బీఫార్మసీ పూర్తి చేసి గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. మంగళవారం రాత్రి అతను చదువుకునేందుకు బైక్‌పై చాంద్రాయణగుట్ట బండ్లగూడలో ఉంటున్న స్నేహితుల వద్దకు వెళుతుండగా శివరాంపల్లి సమీపంలోని మనోహ్మన్‌ సింగ్‌ ఫ్లైఓవర్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు డ్రగ్స్‌ విక్రేతల అరెస్ట్‌

గోల్కొండ: మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు టౌలిచౌకి పోలీసులతో కలిసి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.బాలస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లోకల్‌ సబ్‌ ప్లెడర్స్‌ కదలికలపై పక్కా సమాచారంతో ఈ నెల 19న రాత్రి హెచ్‌ఎన్‌ఈడబ్ల్యూ పోలీసులు, టౌలిచౌకి పోలీసులతో కలిసి టౌలిచౌకి వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తున్న మహ్మద్‌ ఇమ్రాన్‌ ఆలియాస్‌ షుకూర్‌, షేక్‌ బషీర్‌ అహ్మద్‌ ఆలియాస్‌ సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. సన్‌సిటీకి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హుమాయూన్‌నగర్‌ చెందిన షేక్‌ బషీర్‌ అహ్మద్‌ వ్యాపారి. స్నేహితులైన వీరు ఇద్దరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్‌ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్లుగా మహ్మద్‌ ఇమ్రాన్‌ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి, హష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి పరిచయస్తులకు విక్రయించేవాడు. గతంలో అతడిని నాంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇమ్రాన్‌ తన పద్ధతి మార్చుకోలేదు. జల్సాలకు అలవాటు పడిన అతను మళ్లీ మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నాడు. నాంపల్లి, టౌలిచౌకి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ఎండీఎంఏ, ఎల్‌ఎల్‌డీ బ్లాట్స్‌ క్యాష్‌ ఆన్‌ డెలివరీ పద్ధతిలో విక్రయించేవాడు. ఈ క్రమంలో అతడికి హుమాయున్‌నగర్‌కు చెందిన షేక్‌ బషీర్‌ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. అతను మహ్మద్‌ ఇమ్రాన్‌ నుంచి గంజాయి, యాష్‌ ఆయిల్‌, ఎండీఎంఏ కొనుగోలు చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులకు సరఫరా చేసేవాడు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి 13 ఎండీఏఎం, రెండు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అడ్డగుట్ట: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అడ్డగుట్ట డీ సెక్షన్‌కు చెందిన మహేష్‌(39) వెల్డింగ్‌ వర్క్స్‌ చేసేవాడు. మద్యానికి బానిసైన మహేష్‌ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. దీనికితోడు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీపావళి పండుగ రోజు భార్యతో గొడవ పడడంతో ఆమె పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి లోనైన మహేష్‌ మంగళవారం రాత్రి భోజనం చేసి తన రూమ్‌లోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తుకారాంగేట్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య 1
1/1

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement