
రైలు దిగుతుండగా కిందపడి మహిళ దుర్మరణం
సికింద్రాబాద్: లగేజీ తీసుకొని రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడి ఓ ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజస్థాన్‌కు చెందిన కమలాదేవి(45) కుటుంబసభ్యులతో కలిసి కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి అమీన్‌పూర్‌లోని బీరంగూడలో స్థిరపడ్డారు. అయితే, తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఇటీవల తమ స్వగ్రామమైన రాజస్థాన్‌కు వెళ్లారు. తిరిగొస్తున్న క్రమంలో ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో కమలాదేవి తన కుటుంబసభ్యులతో కలిసి రైలు దిగింది. ఒక లగేజీ బ్యాగ్ మరిచిపోవడంతో మళ్లీ రైలెక్కి బ్యాగు తీసుకొస్తుండగా రైలు కదిలింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ ఫాం నెం.2 మధ్యలో పడిపోవడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.