
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
బంజారాహిల్స్: తన అపార్ట్‌మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్‌మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్‌ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారికి చిత్రహింసలు
తల్లి, సవతి తండ్రిపై కేసు నమోదు
మియాపూర్: ఓ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన కన్నతల్లితో పాటు సవతి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శిరీష తెలిపిన వివరాల మేరకు హాఫీజ్‌పేటలో నివా సం ఉంటున్న షభా నజ్వీన్, ముషీరాబాద్‌కు చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తిని 2020లో వివా హం చేసుకుంది. వీరికి నాలుగు, రెండు సంవత్సరాల వయసున్న ఇద్ద రు కుమార్తెలు ఉన్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఆరు నె లల క్రితం షభా నజ్వీన్ భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో గత రెండు నెలల కిందట జోగిపేటకు చెందిన మహమ్మద్ జావిద్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి హాఫీజ్‌పేటలో నివాసముంటుంది. మహమ్మద్ జావిద్ ఆటో నడుపుతుండగా షభా నజ్వీన్ ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా షబా నజ్వీన్ తన నాలుగేళ్ల పెద్ద కుమార్తెను కొడుతూ తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తోంది. తన రెండో భర్తతో కలిసి చిన్నారికి వాతలు పెట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 1న చిన్నారి ఇంటి నుంచి బయటకు రాగా కాలిన గాయాలు చూసి స్థానికులు ప్రశ్నించగా తన తల్లి, సవతి తండ్రి కొట్టారని, వాతలు పెట్టారని చిన్నారి తెల్పడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని పోలీసులకు తెల్పడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికకు చిత్ర హింసలు నిజమని తేలడంతో షబా నజ్వీన్‌తో పాటు సవతి తండ్రి మహమ్మద్ జావిద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారులను వసతిగృహానికి తరలించి..అక్కడి నుంచి స్వంత తండ్రి తాజుద్దీన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
మైల్వార్‌లో ఇసుక ట్రాక్టర్ సీజ్
బషీరాబాద్: రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన మున్నూరు శ్యామప్ప అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మైల్వార్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ పట్టుకున్నారని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కల్లు ధర తగ్గించాలని ధర్నా
తాండూరు రూరల్: కల్లు ధరను తగ్గించాలని పలువురు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దేముల్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. పెద్దేముల్, మంబాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో రెండు రోజులుగా కల్లు దుకాణాలు మూసివేశారన్నారు. గతంలో ఒక్క కల్లు సీసా రూ.10 ఉంటే ప్రస్తుతం రూ.15కు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందని ధర్నా చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడతో వెళ్లిపోయారు.

సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు