
విషాదం మిగిల్చిన సరదా
యాలాల: దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి సరదాగా ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన యాలాల మండలం ముకు ందాపూర్‌తండాలో ఆదివారం చోటు చేసుకు ంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, తండావాసులు తెలిపిన వివ రాల ప్రకారం.. తండాకు చెందిన రతన్‌నాయక్, బాలిబాయి దంపతుల కొడుకు సునీల్(17) సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఎప్పటిలాగే దసరా పండుగకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గ్రామ శివారులోని ముద్దాయి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈత కొడుతుండగా మధ్యలో అలసిపోయి నీటమునిగాడు. గమనించిన మి త్రులు ఈ విషయాన్ని తండావాసులకు చెప్పడంతో చెరువులో గాలించి సునీల్ మృతదేహాన్ని వెలికి తీశారు. పండగకు వచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో నీట మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి