
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
యాచారం: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. పీఎస్ పరిధిలోని మీర్‌ఖాన్‌పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. పండుగల సందర్భంగా ప్రజలు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. కొత్త వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వారికి బానిస కావద్దన్నారు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ వంశీ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.