
అలైన్‌మెంట్ మార్చండి
● ట్రిపుల్‌ఆర్ బాధితుల ఆవేదన
● కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం
షాద్‌నగర్ రూరల్: త్రిపుర్‌ఆర్ రోడ్డు నిర్మాణంలో భూములను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. పేద రైతులను దృష్టిలో పెట్టుకొని త్రిపుల్‌ఆర్ నిర్మాణం అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. త్రిపుల్‌ఆర్ బాధితుల్లో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారు. ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే ఉపాధి కూడా ఉండదని పేర్కొన్నారు. పేదల భూములనే టార్గెట్ చేస్తూ ఒక్కోచోట ఒక్కో రకంగా అలైన్‌మెంట్ మార్కింగ్ ఇచ్చారన్నారు. పేద రైతుల కష్టాలను పట్టించుకోకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే త్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూములను కోల్పోతున్న పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి కిషన్‌రెడ్డి ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఆయనను కలిసిన వారిలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, తంగెళ్లపల్లి మాజీ సర్పంచ్ బాల్‌రాజ్, రైతులు రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, మల్లేశ్ తదితరులు ఉన్నారు.