పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌ | - | Sakshi
Sakshi News home page

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌

Oct 4 2025 8:02 AM | Updated on Oct 4 2025 8:02 AM

పారాహ

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక తాజా సర్వే.. పెరుగుతున్న మధుమేహం, ఊబకాయం గుండె జబ్బులకు ఆహారం జీవనశైలి మార్పులే కారణమని నిర్ధారించింది. సగటున వయసు 40 సంవత్సరాలున్న పురుషులు, మహిళలను ఎంచుకున్న ఈ సర్వే ఫలితం దేశంలో తీవ్రతరమవుతున్న ఆరోగ్య సంక్షోభపు స్థాయిని వెల్లడించింది, ఆహారం జీవనశైలిలో మార్పులు మధుమేహం, ఊబకాయం గుండె జబ్బులతో నేరుగా ఎలా ముడిపడి ఉన్నాయో తేల్చి చెప్పింది.

సర్వసాధారణంగా ..

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌– ఇండియా డయాబెటిస్‌ (ఐసీఎంఆర్‌–ఐఎన్‌డీఐఏబీ) ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ పరిశోధన, 83 శాతం మంది కనీసం ఏదో ఒక మెటబాలిక్‌ రిస్క్‌ ఫ్యాక్టర్‌ కలిగి ఉన్నారని, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం మధుమేహం ఇప్పుడు సర్వసాధారణంగా మారాయని తేల్చింది. మొత్తం 18,090 మందిపై జరిగిన ఈ పరిశోధన నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. సంప్రదాయ ఆహార విధానాలు చురుకై న జీవనశైలి స్థానంలో నిశ్చల దినచర్యలు, అధిక–కార్పొహైడ్రేట్‌ ఆహారాలు చేరడమే ముప్పునకు కారణమని వెల్లడించింది.

రక్తపోటు.. ప్రీ డయాబెటిస్‌

దాదాపు మూడింట ఒక వంతు మందికి అధిక రక్తపోటు (తీవ్రంగా అధిక రక్తపోటు) ఉన్నట్లు కనుగొంటే 9% మందికి కొత్తగా నిర్ధారణ అయిన టైప్‌ 2 డయాబెటిస్‌ ఉంది. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సూచించే ప్రీడయాబెటిస్‌ 41% కన్నా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.

పాలతో ప్రీ డయాబెటిస్‌, గుడ్డుతో చెక్‌

● రకరకాలుగా కార్బోహైడ్రేట్ల వాడకాన్ని తగ్గించకుండా శుద్ధి చేసిన తెల్ల బియ్యం వంటి వాటిని ఽ గోధుమలు.. తదితరాలతో భర్తీ చేయడం మధుమేహం లేదా ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించ లేదని అధ్యయనం స్పష్టం చేసింది. ఆహారంలో ప్రొటీన్‌ బాగా పెంచాల్సిన అవసరం ఉందని, కొన్ని కార్బోహైడ్రేట్లను ప్రోటీన్‌తో భర్తీ చేసినప్పుడు అత్యంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. శాకాహారం,, పాల ఉత్పత్తులు, గుడ్డు లేదా చేప ద్వారా ప్రొటీన్లను తీసుకోవడం టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదం 9–11% తగ్గిస్తుందని, ప్రీడయాబెటిస్‌ ప్రమాదం 6–18% తగ్గిస్తుందని తేల్చింది.

● ముఖ్యంగా ప్రీడయాబెటిస్‌ను నివారించడంలో పాల ద్వారా వచ్చే ప్రోటీన్‌ మంచి పనితీరు చూపింది, అదే సమయంలో గుడ్డు ద్వారా వచ్చే ప్రొటీన్‌ డయాబెటిస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మొత్తంగా చూస్తే వ్యాధుల భారాన్ని తగ్గించడానికి ప్రోటీన్‌–రిచ్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకునేందుకు ప్రోత్సహించాలని అధ్యయనం సూచిస్తోంది. తక్షణం ఈ మార్పుల వైపు దృష్టి సారించాలని లేకపోతే పరిణామాలు వినాశకరమైనవి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం మధుమేహం కలయిక గుండె జబ్బులు స్ట్రోక్‌ రేటును వేగవంతం చేసి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అపారమైన భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు.

83శాతం మందిలో కనిపించిన మెటబాలిక్‌ రిస్క్‌

41శాతం మందిలో ప్రీ డయాబెటిస్‌

మార్పు చేర్పులు, ప్రొటీన్‌ కూర్పులతోనే పరిష్కారం

తాజాగా వెల్లడించిన ఐసీఎంఆర్‌ అధ్యయనం

ఊబకాయం రేట్లు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. దేశ సగటు బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 22.2 మధ్యస్థంగా కనిపించినప్పటికీ, 43% మంది పెద్దవాళ్లు అధిక బరువుతో ఉన్నారు. అలాగే ఆసియా ప్రాంత ప్రమాణాల ప్రకారం చూస్తే 26% మంది ఊబకాయంతో ఉన్నారు. నడుము చుట్టూ అదనపు కొవ్వుతో వచ్చే ఉదర ఊబకాయం, 36 శాతం మందిలో ఉంది ఇదే గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన హాని కారకంగా మారుతోంది. మరోవైపు కొలెస్ట్రాల్‌ సమస్యలు విస్తతమై సగం మందిలో డిస్లిపిడెమియా లేదా అసాధారణ లిపిడ్‌ స్థాయిలు కనిపిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది, ఇక్కడ నిశ్చల జీవనశైలి ఆహారపు అలవాట్లు ప్రమాదాలను పెంచుతున్నాయి. గ్రామీణ నివాసితులతో పోలిస్తే అధిక బరువు, ఊబకాయం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. మహిళలు అధిక స్థాయిలో ఊబకాయాన్ని కలిగి ఉంటే పురుషులకు అధిక రక్తపోటు కొలెస్ట్రాల్‌ సంబంధిత అసాధారణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.

తెల్ల బియ్యం సహా అనేక అనారోగ్య కారకాలు

జీవనశైలి, దేశ ఆహార అలవాట్లు జీవక్రియ వ్యాధికి దాని సంబంధాలను అధ్యయనం లోతుగా పరిశీలించింది. దాని ప్రకారం.. రిఫైన్డ్‌/ శుద్ధి చేసిన గోధుమలు అదనపు చక్కెర. అదే సమయంలో, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్‌ కొరత పెరుగుతోంది. ఈ అసమతుల్యత డయాబెటిస్‌ ఊబకాయాలకు ప్రధాన కారణమవుతోంది. మొత్తంగా ఆహారం తక్కువగా తీసుకునే వారితో పోలిస్తే అధిక కార్బోహైడ్రేట్లు తీసుకున్న వ్యక్తులకు ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరికి టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 30% ప్రీడయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 20%,సాధారణ ఊబకాయం వచ్చే అవకాశాలు 22% ఉదర ఊబకాయం వచ్చే అవకాశాలు 15% ఎక్కువగా కనిపించింది.

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌ 1
1/2

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌ 2
2/2

పారాహుషార్‌.. ప్లేట్‌లో డేంజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement