
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
బాలిక ఆత్మహత్య
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, డ్రగ్ పెడ్లర్స్‌తో కలిసి సంచరిస్తున్న నైజీరియన్ జియోఫ్రీ డోజియోబిబ్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డిపోర్ట్ చేశారు. ఈ ప్రక్రియలో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సహకరించిందని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. నైజీరియాకు చెందిన జియోఫ్రీ డోజియోబిబ్ 2019లో అక్రమంగా దేశంలోకి వచ్చాడు. నైజీరియా నుంచి నేపాల్ చేరిన ఇతగాడు ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్డు మార్గంలో ఢిల్లీ వచ్చాడు. అక్కడ నుంచి నగరానికి చేరుకున్న జియోఫ్రీ టోలీచౌకీలో అక్రమంగా నివసిస్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఇతగాడు కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తోనూ కలిసి తిరుగుతున్నట్లు ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం జియోఫ్రీని టోలీచౌకీలో అదుపులోకి తీసుకుంది. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తనిఖీలు చేసింది. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించకపోవడంతో అక్రమంగా ఉంటున్న ఆరోపణలపై సీసీఎస్‌లోని డిటెన్షన్ సెంటర్‌లో ఉంచింది. నగర పోలీసు ఉన్నతాధికారులు, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారుల సాయంతో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆపై ముంబై విమానాశ్రయం నుంచి నైజీరియాకు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా బలవంతంగా తిప్పి పంపింది.