
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ మంఖాల్‌కు చెందిన చెన్నకేశవులు భార్య మాధవికి అనారోగ్యంగా ఉండడంతో నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన చిన్నమ్మ పోలె రాములమ్మకు తెలపడంతో, తోడుగా ఉండేందుకు ఆమె కుమార్తె నవ్యను పంపించింది. ఆరోగ్యం కుదుట పడడంతో ఈ నెల 22న మధ్యాహ్నం నవ్యను మాధవి భర్త తుక్కుగూడ బస్టాప్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. కాగా సాయంత్రం వరకు కూడా ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో తల్లి మాధవికి తెలిపింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో బుధవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
పోగొట్టుకున్న ఫోన్ అందజేత
కేశంపేట: రెండు నెలల క్రితం కేశంపేట గ్రామంలో జడ్చర్ల మండలంలోని ఎక్వాయపల్లి గ్రామానికి చెందిన శివ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కేసు నమోదు చేశాడు. పోర్టల్‌లో ట్రాక్ చేయడంతో లభ్యమైన ఫోన్‌ను గురువారం సీఐ నరహరి బాధితుడికి అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌కుమార్, కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి ఉన్నారు.

యువతి అదృశ్యం