
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
శంకర్‌పల్లి: ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా బూత్ లెవల్ అధికారులకు ఫారం 6,7,8లకు సంబంధించి ప్యూరిఫికేషన్, అప్లికేషన్‌ను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌వైజర్‌గా జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు వ్యవహరించగా, బాలాజీ, ఆశీర్వాదం, షేక్ మహ్మద్ రోషన్‌లు మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నారు. వారు మాట్లాడుతూ.. శంకర్‌పల్లి మండలం, పట్టణంలో మొత్తం ఆరుగురు సూపర్‌వైజర్లు, 69 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో బీఎల్‌ఓల పాత్ర కీలకమని, వారికిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలను అందులో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ