
విద్యారంగ సమస్యలపై పోరాటం
షాద్‌నగర్‌రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణు అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విశ్వభారతి జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్‌నాయక్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణు భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. దేశంకోసం, ధర్మంకోసం పని చేసే ఏకై క విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. దేశంలో భారతీయత, జాతీయ భావజాలం కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సందీప్, వంశీ, నవీన్, రాకేశ్, అభి, సాయి, యశ్వంత్, పవన్, రామ్‌చరణ్, నందకోమల్, అమరేందర్‌రెడ్డి, రాకేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
● ఏబీవీపీ తెలంగాణ ప్రాంతసహ సంఘటన మంత్రి విష్ణు